WhatsApp
Advertisement

CM Revanth Reddy భారీ యాక్షన్ ప్లాన్.. 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి’!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

సచివాలయంలో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2న గ్రామసభలతో ప్రారంభమై, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పారిశుధ్యం, ఆరోగ్యం, డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం, మహిళా సాధికారత సహా మొత్తం 10 కీలక అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీని పర్యవేక్షణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.

Advertisement

ప్రభుత్వ ఆఫీసుల్లో పేరుకుపోయిన పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం కానుండటం సామాన్యులకు పెద్ద ఊరట. అభివృద్ధి పనులకు వేగంగా శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయిలో పాలన పరుగులు పెట్టనుంది.

మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో దీనిపై సన్నాహక సమావేశాలు జరగనున్నాయి.

Advertisement