మన పత్రిక వెబ్‌డెస్క్, మంచిర్యాల: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ వద్ద మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 17న జరిగిన ఈ దాడి ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా.. పోలీసులు సుమన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఏ. వీరయ్య షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. సుమన్ రూ.25 వేల డిపాజిట్ సమర్పించాలని, మిగతా ముగ్గురు నిందితులు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. సుమన్ విడుదలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్ర అని, అంతిమంగా న్యాయమే గెలిచిందని కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
