మన పత్రిక వెబ్డెస్క్, సూర్యాపేట: జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ (JanaSena) సంచలనం సృష్టించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, జనసేన తన ఉనికిని చాటుకుంటూ జిల్లాలో బోణీ కొట్టింది. ఓటర్లు ‘గాజు గ్లాసు’ గుర్తుకు జై కొట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.
మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు గాను ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 5 స్థానాలకే పరిమితమైంది. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం జనసేన పార్టీ గెలుచుకున్న ఒక్క సీటు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పటికీ, జనసేన అభ్యర్థి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ గెలుపు కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో జిల్లా అంతటా పుంజుకుంటామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయం సాధించిన వార్డులో జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
