మన పత్రిక వెబ్‌డెస్క్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపారు. కౌంటింగ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
మొత్తం 22 వార్డులకు గాను ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీఆర్ఎస్ ఏకంగా 15 వార్డుల్లో విజయం సాధించి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కేవలం 4 వార్డులకే పరిమితమైంది. ఇక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ఈ ఫలితాలతో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ వశం కావడం ఖాయమైంది. మెజారిటీకి అవసరమైన సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాలు వెలువడగానే గుమ్మడిదల పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి సంబరాలు చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2% డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం
- Telangana Weather: 5 రోజుల పాటు వర్షాలు.. జిల్లాల వారీగా వివరాలు
- Gold Price Today: ఈరోజు బంగారం ధరలు April 18
- Lenskart: బాయ్‌కాట్ ట్రెండ్‌పై సీఈవో వివరణ, క్షమాపణలు
