టాలీవుడ్ లో 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన క్రేజీ చిత్రాల్లో ” మన శంకర వర ప్రసాద్ గారు” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా ఏకంగా 300 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు రీజనల్ మూవీస్ అన్ని సినిమాల రికార్డులని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. విడుదలై నాలుగు వారాలైనా ఇప్పటికి పలు మేజర్ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ద్వారా చిరు తాజాగా మరో క్రేజీ రికార్డును అందుకున్నాడు.
మన శంకర వర ప్రసాద్ గారు (ManaShankaraVaraPrasadGaru) తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan) రికార్డు కూడా బద్దలు కొట్టారు. అవును.. చిరు నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా పవన్ కళ్యాణ్ “ఓజి” (OG) సినిమా కలెక్షన్స్ రికార్డ్ ని షేర్ పరంగా క్రాస్ చేసింది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఓజి సినిమా వరల్డ్ వైడ్ గా 178 కోట్ల షేర్ ని వసూలు చేయగా, తాజాగా మన శంకర వర ప్రసాద్ 180 కోట్ల షేర్ వసూలు చేసి తమ్ముడి రికార్డ్ ని బ్రేక్ చేసేసాడు. ఇక వరల్డ్ వైడ్ గా రీజనల్ మూవీస్ పరంగా తెలుగు వెర్షన్ ప్రకారం అల్ టైం టాప్ 8th మూవీస్ లో ఒకటిగా నిలవగా, తెలుగు రాష్ట్రాల్లో అల్ టైం top 5 గ్రాసర్ గా నిలిచినట్టు సమాచారం.
ఇక ఈ రాబోయే వారం లో “ఫంకీ” మినహా పెద్దగా అంచనాలున్న సినిమాలు ఏమి రిలీజ్ కావడం లేదు కనుక, ఐదో వారం కూడా మన శంకర వర ప్రసాద్ లిమిటెడ్ స్క్రీన్స్ లో రచ్చ చేయనున్నాడని చెప్పాలి. ఇక చిరు ఈ సినిమా తర్వాత విశ్వంభర ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే, శ్రీకాంత్ ఓదెల తో, అలాగే బాబీ తో ఒక సినిమా చేయనున్నాడు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
