గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) నటిస్తున్న “పెద్ది” (Peddi) మార్చి 27న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించినా, అక్కడి నుండి అఫిషియల్ గా తప్పుకుందని మేకర్స్ నుండి అనౌన్స్ రాకముందే చాలా మంది పెద్ది వాయిదా ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే పెద్ది వాయిదా పడగా, ఈ డేట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) లాక్ చేసారు. అబ్బాయ్ తప్పుకున్న డేట్ కి బాబాయ్ రానుండడంతో మెగా ఫ్యాన్స్ కి ఏం డోకా లేకుండా పోయింది. ఎవరొచ్చినా ఫ్యాన్స్ ఖుషినే. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagth singh) ని మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన కాసేపటికే పెద్ది రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. రెండు సినిమాలను నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ (Mythri movie makers) అని తెలిసిందే. ఇక పెద్ది సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఒక పవర్ ఫుల్ పోస్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ డేట్ తో సమ్మర్ లో రానున్నట్టు ప్రకటించారు. ఇక నాలుగు వారాలే గ్యాప్ ఉండడం, పైగా వస్తుంది రెండూ మెగా సినిమాలే కావడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు.
ఇక రామ్ చరణ్ కూడా మరోసారి తండ్రి అవడంతో ఇంటికి టైం ఇస్తూ, షూటింగ్ ని మెల్లిగా ఫినిష్ చేసి, ప్రమోషన్లకు తీరిగ్గా టైం కేటాయించొచ్చు. ఇక పెద్ది లో జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, చికిరి సాంగ్ స్కై లెవెల్లో అంచనాలను పెంచేసాయి. కాగా ఈ నెలలోనే రెండో సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
