తెలంగాణాలో ఉన్న నిరుద్యోగులకు తాజాగా ప్రభుత్వం నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది. అయితే ఇది దివ్యంగులకు మాత్రమే. తెలంగాణ (Telangana) లో ఈ కొత్త ఏడాదిలో నిర్ణీత సమయంలోనే ఉద్యోగ నియామకాలు పూర్తిచేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా నాంపల్లిలో జెండా ఎగరేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒకే పరీక్షతో పూర్తయ్యే నియామకాలను ఈ మూడు నెలల్లోపు మల్టిపుల్ పరీక్షలున్నాయన్నారు. వీటిని రాబోయే ఆరునెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు.
అయితే ఈ క్రమంలో నీట్ పీజీ దివ్యాంగ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని కన్వీనర్ కోటా సీట్లకు దివ్యాంగుల కేటగిరీలో అర్హత సాధించి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెడికల్ బోర్డు ఎదుట హాజరుకావాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి (Radhikareddy) ఓ ప్రకటనలో తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం మెరిట్ ర్యాంకు 1 నుంచి 14 వరకు వచ్చిన వారు జనవరి 29న ఉదయం 10 గంటలకు హాజరుకావాలని,15 నుంచి 28 మధ్య వచ్చిన ర్యాంకర్లు జనవరి 30న ఉదయం 10 గంటలకు మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాలని తెలిపారు. ఇక ఆయా అభ్యర్థుల పేర్లను ఇప్పటికే తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్ధులు ఆయా తేదీల్లో దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యా సంబంధిత సర్టిఫికట్లను తమతోపాటు తీసుకురావాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
