టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ లో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) హీరోగా నటిస్తున్న “స్వయంభు” (Swayambhu) సినిమా కూడా ఒకటి. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ఈ సినిమా అనౌన్స్ చేయగా, రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వంద కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా భాషలతో పాటు చైనీస్, కొరియన్ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha menon), నభా నటేష్ (Nabha natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభు పై భారీ అంచనాలున్నాయి. కాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ఇక ఈ సినిమాని పిక్సెల్ స్టూడియో బ్యానర్ పై శ్రీకర్, భువన్ నిర్మిస్తుండగా రవి బసూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే మహా శివరాత్రి కానుకగా 2026 ఫిబ్రవరి 13 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. మేకర్స్ నుండి ఇంకా అఫిషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ న్యూస్ నిజమే.
అయితే వచ్చిన సమాచారం ప్రకారం మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ గురించి బాగా ఆలోచించి ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు స్వయంభు ని రెడీ చేస్తున్నారని సమాచారం. అయితే స్వయంభు వాయిదా కి గల అసలు కారణాలేంటి అని ఇంకా క్లారిటీగా తెలీదు. బహుశా షూటింగ్ పూర్తి స్థాయిలో ఫినిష్ కాకపోవడం అయి ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. కానీ ఒకటి మాత్రం నిజం స్వయంభు ఎప్పుడొచ్చినా సెన్సేషన్ ఖాయమని మూవీ లవర్స్ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
