సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి ధీటుగా పది రెట్లు సెంట్రల్ జాబ్స్ కోసం పోటీపడతారు నిరుద్యోగ యువత. తాజాగా మళ్ళీ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి తాజాగా భారీగా ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ అందింది. వచ్చిన సమాచారం ప్రకారం నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) మరో నుండి భారీగా ఉద్యోగాల ప్రకటన వచ్చింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఏకంగా దాదాపు 22 వేలకుపైగా గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ మేరకు లెవల్ 1 పోస్టులకు సంబంధించి షార్ట్ ఉద్యోగ ప్రకటనను RRB తాజాగా జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం జనవరి 21 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కావాల్సింది ఉండగా, జనవరి 31నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. మార్చి 2 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక ఈ మొత్తం పోస్టుల్లో పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐలో అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటన జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్ ఈ నెలాఖరు నాటికి వెలువడే అవకాశం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
