మన పత్రిక వెబ్‌డెస్క్, సిరిసిల్ల: మండల విద్యాధికారి మంకు రాజయ్య స్మారకార్థం నిర్వహించిన ‘టీచర్స్ ప్రీమీయర్ లీగ్’ (TPL) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో జిల్లాలోని ఆరు జట్లు తలపడగా, ఫైనల్ లో సిరిసిల్ల జట్టుపై గెలిచిన కోనరావుపేట టీమ్ విజేతగా నిలిచింది. సిరిసిల్ల జట్టు రన్నరప్ గా నిలిచింది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే విజేతలకు కప్ ను అందించి అభినందించారు. ఉపాధ్యాయులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్ సేఫ్టీ పోస్టర్ ను ఆవిష్కరించి, అందరితో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
Advertisement


ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
