మన పత్రిక వెబ్‌డెస్క్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించే ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha – PPC 2026) 9వ ఎడిషన్‌కు సమయం ఆసన్నమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లకు నేడే (జనవరి 11) ఆఖరు తేదీ. ప్రధానితో నేరుగా మాట్లాడే అరుదైన అవకాశాన్ని అందుకోవాలనుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
రిజిస్ట్రేషన్ల సునామీ ఈ ఏడాది పీపీసీకి అసాధారణ స్పందన లభించింది. గతేడాది 3.53 కోట్ల రిజిస్ట్రేషన్లతో నెలకొల్పిన ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను బద్దలు కొడుతూ.. ఈసారి ఏకంగా 4,30,18,173 మంది (4.3 కోట్లు) దరఖాస్తు చేసుకున్నారు.
- విద్యార్థులు: సుమారు 4 కోట్లు
- టీచర్లు: 24 లక్షలు
- తల్లిదండ్రులు: 5.7 లక్షలు
ఎవరు అర్హులు? – ప్రయోజనాలు ఏంటి?
- 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనికి అర్హులు.
- దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి అధికారిక ‘పార్టిసిపేషన్ సర్టిఫికేట్’ అందుతుంది.
- ‘మై గవ్’ (MyGov) పోర్టల్‌లో నిర్వహించే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ (MCQ) పోటీ ద్వారా ఎంపికైన వారు ప్రధానిని నేరుగా పరీక్షల ఒత్తిడి, కెరీర్ ప్లానింగ్‌పై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
- అధికారిక వెబ్సైట్
innovateindia1.mygov.inను సందర్శించండి. - హోమ్ పేజీలో ఉన్న ‘Pariksha Pe Charcha 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ వివరాలతో లాగిన్ అయి, అప్లికేషన్ ఫారమ్ నింపండి.
- వివరాలు సరిచూసుకుని సబ్మిట్ చేయండి.
జనవరి నెలాఖరులో ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. పరీక్షల భయాన్ని పోగొట్టి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు 2018 నుంచి ప్రధాని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
