మన పత్రిక వెబ్‌డెస్క్, సూర్యాపేట: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా రోడ్డుపై పోలీసులు ఆపితే చలానా వేస్తారని భయపడే వాహనదారులకు.. జిల్లా ఎస్పీ నరసింహ పువ్వులు అందించి ఆశ్చర్యపరిచారు.
ఆంధ్ర వెళ్లే వారికి.. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనదారులకు ఎస్పీ నరసింహ స్వయంగా పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని ఎఫ్‌సీఐ (FCI) గోదాం వద్ద జాతీయ రహదారి-65పై ఆయన వాహనాల రద్దీని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులను ఆపి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, కుటుంబంతో సంతోషంగా పండుగ జరుపుకుని, అంతే క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
భద్రత ముఖ్యం పండుగ రద్దీ దృష్ట్యా మితిమీరిన వేగంతో వెళ్లవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఎస్పీ సూచించారు. పోలీసుల స్నేహపూర్వక వైఖరిని వాహనదారులు అభినందించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
