మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఏకంగా రూ.1.02 కోట్ల ప్రమాద బీమా (Accident Insurance) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధికారిక ప్రకటన విడుదల చేశారు.
బ్యాంకర్లతో చర్చలు సఫలం రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ (Regular Employees) ఈ బీమా పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ స్కీమ్ అమలు కోసం ప్రముఖ బ్యాంకర్లతో జరిపిన సంప్రదింపులు విజయవంతమయ్యాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం.. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
5.14 లక్షల మందికి లబ్ధి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5.14 లక్షల మంది పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ బకాయిలను సైతం దశలవారీగా క్లియర్ చేస్తున్నామని భట్టి గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఇప్పటికే వీరికోసం.. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 38 వేల మంది సింగరేణి ఉద్యోగులకు, అలాగే విద్యుత్ సంస్థలైన (Transco, Genco, Discoms) 71,387 మంది ఉద్యోగులకు ఈ తరహా బీమా అమలవుతోంది. ఇప్పుడు ఈ రక్షణ కవచాన్ని మిగిలిన రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విస్తరించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
