Advertisement

బిగ్ అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్! ఈ ఏరియాల్లోనే..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరవాసులకు జలమండలి (HMWSSB) కీలక హెచ్చరిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 36 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుందని ప్రకటించింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2లో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతుండటమే ఇందుకు కారణం.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జలమండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 10వ తేదీ (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి జనవరి 11వ తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.

Advertisement

నీళ్లు రాని ప్రాంతాల జాబితా ఇదే: రిపేర్ పనుల కారణంగా కింది ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోనుంది:

  • వనస్థలిపురం, ఆటోనగర్: వైశాలీనగర్, నాగోల్, ఆటోనగర్ రిజర్వాయర్ ప్రాంతాలు.
  • బడంగ్‌పేట్, ఆదిభట్ల: లెనిన్ నగర్, కమ్మగూడ రిజర్వాయర్ పరిధి.
  • బాలాపూర్: బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం.
  • నాచారం: యెల్లుగుట్ట రిజర్వాయర్ పరిధి.
  • సికింద్రాబాద్ పరిధి: తార్నాక, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మహేంద్ర హిల్స్, కంటోన్మెంట్ బోర్డు, ఎంఈఎస్, రైల్వేస్.
  • ఇతర ప్రాంతాలు: హష్మత్‌పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, మధుబన్ (పాక్షికంగా), శాస్త్రిపురం, ప్రశాసన్‌నగర్, నేషనల్ పోలీస్ అకాడమీ.

కారణం ఏంటి? కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై ఏర్పడిన లీకేజీని సరిచేయడం, నాసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు, బటర్‌ఫ్లై వాల్వ్‌ల మార్పిడి వంటి పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement