మన పత్రిక వెబ్‌డెస్క్, చెన్నై: ప్రముఖ నటుడు, తవిక (TVK) అధినేత విజయ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బిగ్ షాక్ ఇచ్చింది. గతేడాది కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అధికారులు స్పష్టం చేశారు.
గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది అభిమానులు మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, విజయ్ నటించిన చివరి చిత్రం ‘జనా నాయకన్’ జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఈ నోటీసులు రావడం గమనార్హం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
