మన పత్రిక వెబ్‌డెస్క్, సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నగరంలోని ముఖ్యమైన స్టేషన్లలో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ, టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది.
హైటెక్ సిటీ, చర్లపల్లిలో హాల్టింగ్ సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రయాణికులకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది.
- హైటెక్ సిటీ: సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి రాకపోకలు సాగించే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్‌లో ఆగుతాయి. ఇందులో మచిలీపట్నం-బీదర్, నర్సాపూర్-లింగంపల్లి, జన్మభూమి, గౌతమి, సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లు, విశాఖపట్నం-ముంబయి ఎల్‌టీటీ, కోణార్క్ వంటి రైళ్లు ఉన్నాయి.
- చర్లపల్లి: సికింద్రాబాద్ – విజయవాడ మార్గంలో నడిచే 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ ఇచ్చారు. సింహపురి, గౌతమి, కాకినాడ ఎక్స్‌ప్రెస్, గరీబ్‌రథ్, విశాఖ, గోదావరి, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాద్ నగర శివారుల్లో ఉండేవారు సికింద్రాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ స్టేషన్లలో దిగవచ్చు, ఎక్కవచ్చు.
టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ‘రైల్‌వన్’ (RailOne) యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనుగోలు చేసే వారికి 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జూలై 14వ తేదీ వరకు అమలులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా రిజర్వుడు, అన్‌రిజర్వుడు టికెట్లతో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా పొందవచ్చు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
