Advertisement

Suresh Kalmadi: సురేశ్ కల్మాడి కన్నుమూత.. కేంద్ర మాజీ మంత్రి మృతితో విషాదం

మన పత్రిక వెబ్​డెస్క్, పుణె: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పుణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. పుణె నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికైన కల్మాడి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు.

భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా క్రీడా రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, దాదాపు 15 ఏళ్ల విచారణ అనంతరం ఇటీవలే కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన పార్థివ దేహానికి ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు పుణెలోని వైకుంఠ్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement
Advertisement