మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఇకపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ (Road Safety Cess) పేరుతో కొత్త పన్ను వసూలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త విధానం ప్రకారం.. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్లకు రూ.5 వేలు, లారీల వంటి భారీ వాహనాలకు రూ.10 వేల చొప్పున సెస్ వసూలు చేయనున్నారు. అయితే, సామాన్యులకు ఊరటనిస్తూ ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
