మన పత్రిక, వెబ్డెస్క్: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ వేళల్లో టీటీడీ కీలక మార్పులు చేసింది. 2026 మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో, ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 8:30 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా ఆ రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేశారు.
మరోవైపు, కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 19 నుంచి 27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 24న స్వామివారి కల్యాణోత్సవం, 25న రథోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
