మన పత్రిక, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో (Peddapalli district) పంచాయతీ నిధుల దుర్వినియోగం కలకలం రేపింది. ప్రభుత్వ నిధులను జేబులో వేసుకున్న సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాస్‌పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వేటు వేశారు. శనివారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి శ్రీనివాస్ ఏకంగా రూ.4,17,175 నిధులను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు విచారణలో తేలింది.
ఇంటి పన్నులో భారీ గండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామంలో రూ.6,31,057 ఇంటి పన్ను వసూలు చేయగా, అందులో కేవలం రూ.3,87,382 మాత్రమే ప్రభుత్వ ఖాతాలో (ఎస్.టి.ఓ) జమ చేశారు. మిగిలిన రూ.2,43,675 నిధులను పక్కదారి పట్టించి సొంతానికి వాడుకున్నారు.
జీతాలు, టీఎస్-బీపాస్ నిధులు కూడా.. అలాగే మల్టీ పర్పస్ వర్కర్ల జీతాల చెల్లింపు కోసం వసూలు చేసిన మొత్తంలో రూ.38,500 నొక్కేశారు. దీనికి తోడు టీఎస్-బీపాస్ ఖాతా నుంచి మరో రూ.1,35,000 దారి మళ్లించారు. మొత్తంగా రూ.4 లక్షలకు పైగా నిధులను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
