మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల (Municipal Elections 2026) నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే.. ఈ నెలలోనే (జనవరి) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ నెల రెండో లేదా మూడో వారంలో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఓటర్ల జాబితా రెడీ: ఎన్నికల సంఘం ఇప్పటికే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 45 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండగా, అందులో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు ఉన్నారు.
ముఖ్యమైన తేదీలు:
- జనవరి 4: ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ.
- జనవరి 10: తుది ఓటర్ల జాబితా (Final Voter List) ప్రకటన.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
