Advertisement

కేటీఆర్ ఫైర్.. ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులు

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలను, వేలాది మంది డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన ధ్వజమెత్తారు.

నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్ల నేతలను, డ్రైవర్లను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన ఆటో అన్నలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

అసెంబ్లీలో ప్రకటన చేయాలి: ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆటో అన్నలు కోరినట్లుగానే, హామీల అమలుపై ప్రభుత్వం ఈరోజే అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement