మన పత్రిక, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా (Nalgonda District) నూతన కలెక్టర్ బి. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పరిపాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. శుక్రవారం తన ఛాంబర్‌లో తొలిసారిగా రెవెన్యూ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ కీలక ఆదేశాలు:
Advertisement
- ప్రజావాణి ప్రాధాన్యం: ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులకు నామమాత్రపు చర్యలు కాకుండా, ఖచ్చితమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల నుంచి తరచూ ఒకే విషయంపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
- పక్కా రికార్డులు: ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే బాధితులకు రశీదు ఇవ్వాలని, రిజిస్టర్లలో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
- క్షేత్రస్థాయిలో..: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అవసరమైనప్పుడు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిగా భాగస్వాములు కావాలని తెలిపారు.
- నెలవారీ సమీక్ష: ఇకపై ప్రతి నెలా తహసీల్దార్లతో తప్పనిసరిగా సమావేశం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో భూభారతి, పౌరసరఫరాల శాఖ అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
