మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు పట్టిన గ్రహణం వీడనుంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం.
రూ.3000 కోట్లు పెండింగ్: గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు రూ.3000 కోట్ల నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో, పెండింగ్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. రెండేళ్ల క్రితం ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలను (Utilization Certificates) వెంటనే సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది.
అధికారుల కసరత్తు: కేంద్రం అడిగిన సమాచారాన్ని అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ వివరాలు పంపిస్తే వెంటనే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
మాజీ సర్పంచుల్లో చిగురిస్తున్న ఆశలు: మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో సొంత డబ్బులతో గ్రామాభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు రావడం, కేంద్రం నుంచి నిధుల విడుదలకు మార్గం సుగమం కావడంతో తమ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందనే ఆశతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
