మన పత్రిక, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకలు విషాదాంతమయ్యాయి. భవానినగర్‌లో బుధవారం రాత్రి 17 మంది స్నేహితులు కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం తాగి, బిర్యానీ తిన్నారు.
విందు ఆరగించిన కాసేపటికే 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మిగిలిన 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ లేదా కల్తీ మద్యం కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
