మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల నక్సలైట్ల చరిత్రలో ‘కత్తుల సమ్మయ్య’ది ఓ ప్రత్యేకమైన, వివాదాస్పదమైన అధ్యాయం. నక్సలైట్లకు కోవర్టుగా మారి, పోలీసులకు సహకరించి, పీపుల్స్‌వార్ ఉద్యమాన్ని దెబ్బతీసిన సమ్మయ్య ఉదంతం అప్పట్లో సంచలనం. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వేముల సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
డీజీపీ రియాక్షన్: నిన్న ఓ జర్నలిస్ట్ కత్తుల సమ్మయ్య గురించి ప్రశ్నించగా.. “అది మన సబ్జెక్ట్ కాదు.. ఎప్పుడో దాటిపోయాం (Closed Chapter)” అని డీజీపీ నవ్వుతూ సమాధానం దాటవేశారని, ఆ ఆన్సర్ తనకు నచ్చిందని సత్యనారాయణ తన పోస్టులో పేర్కొన్నారు.
అసలేం జరిగింది? (జర్నలిస్ట్ పోస్ట్ సారాంశం): గతంలో డీజీపీ హెచ్.జె. దొర హయాంలో సమ్మయ్యను పోలీసులు శ్రీలంక పంపారని, అక్కడ విమాన ప్రమాదంలో అతను చనిపోయాడని సత్యనారాయణ గుర్తుచేశారు. అప్పట్లో డీజీపీ ఆఫీస్ “Sammayya is no more” అని ఓ ప్రముఖుడికి ఇచ్చినట్లుగా ప్రెస్ నోట్ ఇవ్వడం, సమ్మయ్య భార్యకు అత్యవసరంగా పాస్‌పోర్ట్ ఇప్పించి శ్రీలంక పంపడం, బేగంపేట ఎయిర్‌పోర్టుకు మృతదేహాన్ని తీసుకురావడం వంటి ఘటనలపై తాను రాసిన బ్యానర్ కథనాలు అప్పట్లో పోలీసు వర్గాల్లో కలకలం రేపాయని ఆయన రాసుకొచ్చారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
