మన పత్రిక, వెబ్డెస్క్: నిజామాబాద్ జిల్లా పరిపాలనలో కీలక మార్పు జరిగింది. జిల్లా కలెక్టర్గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) అదనపు కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఇలా త్రిపాఠిని నిజామాబాద్ నూతన కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇలా త్రిపాఠి ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె భద్రాచలం, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అదనపు కలెక్టర్గా పనిచేశారు. ములుగు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
