మన పత్రిక, వెబ్‌డెస్క్: సంక్రాంతి సంబరాల వేళ గాలిపటాలు ఎగురవేయడానికి నిషేధిత చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. ఈ దారం విక్రయించినా, నిల్వ చేసినా, వాడినా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
వ్యాపారులు కేవలం లాభాల కోసం చైనీస్ మాంజా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఎస్పీ హితవు పలికారు. ఈ దారం వల్ల పక్షులు, మూగజీవాలే కాకుండా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని, మెడకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు, పతంగుల విక్రయ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారన్నారు. ఎక్కడైనా చైనీస్ మాంజా లభ్యమైతే సీజ్ చేయడంతో పాటు, విక్రేతలపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
