మన పత్రిక, వెబ్‌డెస్క్: పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ మాజీ సర్పంచులు చేపట్టిన ఆందోళనతో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మారినా విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.531 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
