మన పత్రిక, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గ్రామానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఆండాలు మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఈ కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఇట్టే ఇంద్రారెడ్డి, గట్టు యాదయ్య, గుండాల సతీష్, ఉపసర్పంచ్ కోయగూర శ్రీను, యూత్ అధ్యక్షుడు మేడి సంతోష్, ఇతర వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- HYDRAA Jobs: సరూర్నగర్ స్టేడియం వద్ద భారీగా నిరుద్యోగులు.. తోపులాట
- Telangana Rain Forecast: తెలంగాణలో మళ్లీ వానలు.. పలు జిల్లాలకు వర్ష సూచన
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ మంచి వసూళ్లు
- జాన్వీ కపూర్, శ్రీలీల కాంబినేషన్లో హిందీ రొమాంటిక్ థ్రిల్లర్
- సన్ నెక్స్ట్లోకి లోకేష్ కనగరాజ్ ‘డిసి’ డిజిటల్ హక్కులు
