మన పత్రిక, వెబ్‌డెస్క్: రైల్వే ప్రయాణికులపై అదనపు భారం పడింది. పెరిగిన రైల్వే టికెట్ ధరలు నేటి నుంచి (డిసెంబర్ 26) అమల్లోకి వచ్చాయి. దూర ప్రయాణాలను బట్టి ఈ పెంపు వర్తిస్తుంది. 216 నుంచి 750 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 5, 751-1250 కి.మీలకు రూ. 10, 1251-1750 కి.మీలకు రూ. 15, అలాగే 1751 కి.మీ దాటితే రూ. 20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
స్లీపర్, ఫస్ట్ క్లాస్ చార్జీలను కిలోమీటరుకు ఒక పైసా చొప్పున, మెయిల్/ఎక్స్‌ప్రెస్ మరియు ప్రీమియం రైళ్లలో 2 పైసల చొప్పున పెంచారు. అయితే సబర్బన్ రైళ్ల చార్జీలలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 26కు ముందు బుక్ చేసుకున్న టికెట్లకు పెంపు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది చార్జీలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
