Advertisement

ఆ ఇద్దరు మంత్రులు జైలుకే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఆధారాలతో సహా కేంద్రం వద్ద వారి చిట్టా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వారిపై ఉందని, ఆ ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కూడా సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌ను బూతులు తిట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రజల్లో కేసీఆర్‌పై సానుభూతి పెంచేందుకే రేవంత్ ఇలా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ కుటుంబమేనని, అందుకే ప్రజలు వారిని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement