మన పత్రిక, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీ భారీగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదం, వైద్య సహాయం నిరంతరం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నిన్న (డిసెంబర్ 24) ఒక్కరోజే 73,254 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 4.88 కోట్ల ఆదాయం లభించింది. అలాగే 29,989 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
