మన పత్రిక, వెబ్డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి హింసతో రగిలిపోతోంది. ఇంకిలాబ్ మంచ్ నాయకుడు, కరడుగట్టిన నేత ఉస్మాన్ హాది (Usman Hadi) హత్య తర్వాత ఢాకాలో మొదలైన అల్లర్లు ఇంకా చల్లారకముందే మరో ఘాతుకం జరిగింది. సోమవారం బీఎన్పీ (BNP) ఖుల్నా డివిజన్ అధిపతి మోతలేబ్ సిక్దర్పై (Motaleb Sikder) గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉస్మాన్ హాది మరణం తర్వాత దేశవ్యాప్తంగా అశాంతి నెలకొనగా, తాజా కాల్పుల ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను మోహరించింది. 2024 విద్యార్థి ఉద్యమం సమయంలో వెలుగులోకి వచ్చిన ఉస్మాన్ హాది, భారత వ్యతిరేక వ్యాఖ్యలతో పాపులర్ అయ్యారు. ఆయన హత్య తర్వాత బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
