మన పత్రిక, వెబ్‌డెస్క్: రైలు ప్రయాణికులకు చేదు వార్త. రైల్వే టికెట్ ఛార్జీలను (Train Ticket Fares) స్వల్పంగా పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, స్వల్ప దూర ప్రయాణికులకు మాత్రం ఊరట లభించింది.
పెంపు వివరాలు ఇలా:
Advertisement
- మినహాయింపు: 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి, సబ్ అర్బన్ రైళ్లలో సీజన్ టికెట్లకు పెంపు వర్తించదు.
- పెంపు: 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి..
- సాధారణ తరగతి (Ordinary Class) బోగీల్లో కిలోమీటర్‌కు 1 పైసా.
- నాన్ ఏసీ ఎక్స్‌ప్రెస్, మెయిల్, అన్ని ఏసీ క్లాసుల్లో (AC Class) కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున పెంచారు.
ఈ పెంపు ద్వారా 2026 మార్చి నాటికి రూ. 600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
