మన పత్రిక, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రత్నా అనే మహిళ రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతి చెందారు.
స్థానిక గోపాల్‌పూర్ ఎక్స్ రోడ్ (Gopalpur X Road) పై ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చల్మెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
