మన పత్రిక, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బిష్నా రింగ్ రోడ్డుపై ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో సుమారు 35 మంది విద్యార్థులు గాయపడ్డారు.
సాంబా (Samba) ప్రాంతంలో పిక్నిక్ ముగించుకుని విద్యార్థులతో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు (Fog) కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో బస్సు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మూ ఎయిమ్స్, జీఎంసీ ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
