WhatsApp
Advertisement

నవ దంపతుల మృతి.. వంగపల్లి వద్ద విషాదం.

మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వంగపల్లి-ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య నవ దంపతులు రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం (25), భవాని (19)గా గుర్తించారు.

వీరు సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో (Machilipatnam Express) విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగపల్లి దాటిన తర్వాత ఇద్దరూ రైలు ద్వారం (Door) వద్ద నిలబడి ఉండగా, ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పెళ్లైన కొత్తలోనే ఇద్దరూ ఇలా అనంతలోకాలకు వెళ్లడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Advertisement
Advertisement