మన పత్రిక, వెబ్‌డెస్క్: ‘అఖండ’ విజయంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2’లో (Akhanda 2) బాలయ్య తనదైన శైలిలో నట విశ్వరూపం చూపించారు. సినిమా మొత్తం బాలయ్య ‘వన్ మ్యాన్ షో’ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అఖండ పాత్ర ప్రవేశించిన తర్వాత థియేటర్లలో పూనకాలు తెప్పించే రేంజ్లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అఘోరా గెటప్‌లో బాలయ్య లుక్, నడవడిక, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు సూరీడు లుక్‌ను పోలిన గెటప్‌లో బాలయ్య కొత్తగా కనిపించారు.
కథా నేపథ్యం ఈసారి కథలో చైనాను విలన్‌గా చూపించారు. హిందూ ధర్మాన్ని, కుంభమేళాలను టార్గెట్ చేస్తూ నదుల్లో వైరస్ కలిపి బయోవార్‌కు దిగడం అనే పాయింట్‌తో కథ నడుస్తుంది. అయితే, ఈ పాయింట్లో లాజిక్ కొంత మిస్ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా ఆర్మీ జనరల్స్ సొంత నిర్ణయాలు తీసుకోవడం, వైరస్ వ్యాప్తి వంటి అంశాల్లో దర్శకుడు బోయపాటి తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదకర వైరస్ నుంచి దేశాన్ని రక్షించడానికి సైంటిస్ట్ (హర్షాలి) ప్రయత్నించడం, ఆమెను కాపాడేందుకు అఖండ రంగంలోకి దిగడం ప్రధాన ఇతివృత్తం.
నటీనటుల పనితీరు బాలకృష్ణ రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్లలోనూ తన అనుభవాన్ని చూపించారు. కథానాయికగా ప్రజ్ఞా జైస్వాల్, సైంటిస్ట్ పాత్రలో హర్షాలి తమ పరిధి మేరకు నటించారు. చైనా ఆర్మీ జనరల్‌గా షాంఘై షెల్ట్రిం, మాజీ జనరల్‌గా శాశ్వత ఛటర్జీ, ప్రధానిగా సర్వదమన్ బెనర్జీ, క్షుద్ర మాంత్రికుడిగా ఆది నటించారు.
సాంకేతిక వర్గం ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలం. అయితే కొన్ని చోట్ల శబ్దం మోతాదు మించిందనే విమర్శలు ఉన్నప్పటికీ, మాస్ ఆడియెన్స్‌కు అది కిక్ ఇస్తుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. హిమాలయాలు, కుంభమేళా సెట్లు కనువిందు చేస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య చేతిలో త్రిశూలం, గద, మిషన్ గన్లతో చేసే ఫైట్లు అభిమానులకు పండగే.
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
