Advertisement

మరో 77 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల రద్దు పర్వం వరుసగా ఐదో రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్‌కు రావాల్సిన 38 సర్వీసులు, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 39 సర్వీసులు కలిపి.. మొత్తంగా 77 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రద్దయిన ఇండిగో విమానాల సంఖ్య 500కు చేరింది. ముంబై (112), బెంగళూరు (124), ఢిల్లీ (109) నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో రద్దు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయాణికుల అవస్థలు మాత్రం తగ్గలేదు.

Advertisement
Advertisement