Advertisement

తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు కేంద్రం డుమ్మా.. హాట్ టాపిక్‌గా మారిన ‘ఢిల్లీ’ వైఖరి!

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమిట్’కు కేంద్ర ప్రభుత్వం దూరంగా ఉండటం రాజకీయ, బ్యూరోక్రాట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించినప్పటికీ, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.

‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. అయితే, ఏపీలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరైనప్పటికీ, తెలంగాణ సదస్సుకు మాత్రం కేంద్ర పెద్దలు రాకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కనీసం ప్రధాని నుంచి వీడియో సందేశం కూడా లేకపోవడం, గ్లోబల్ ఈవెంట్‌ను గవర్నర్ ప్రారంభించాల్సి రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉందన్న కారణంతోనే ఈ వివక్ష చూపుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement