మన పత్రిక, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పోలీసు శాఖలో అవినీతి, నిర్లక్ష్యంపై సీపీ సజ్జనార్ (CP Sajjanar) కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా కుల్సుంపుర సీఐ సునీల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఓ కేసులో డబ్బులు తీసుకుని నిందితుల పేర్లను మార్చారని, వారికి అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపారు. ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ సునీల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల కాలంలో విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న వారిపై సీపీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత నవంబర్‌లో టప్పాచబుత్రా సీఐ అభిలాష్‌ను నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేశారు. అలాగే రోలెక్స్ వాచ్ దొంగిలించిన కానిస్టేబుల్, సెల్ ఫోన్ చోరీ చేసిన పోలీస్ డ్రైవర్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. శాఖలో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
