మన పత్రిక, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్ (Birmingham) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) సంభవించిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ మండలం, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన ఉడుమల సహజారెడ్డి (24)గా గుర్తించారు.
నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లారు. ప్రమాద సమయంలో మంటల్లో చిక్కుకుని సహజారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. చేతికి అందివచ్చిన కుమార్తె ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
