మన పత్రిక, వెబ్‌డెస్క్: ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో మరోసారి మార్పులు చేసింది. బడ్జెట్ ధరలో డేటాతో పాటు వినోదాన్ని అందించే రూ. 121 మరియు రూ. 181 డేటా వోచర్లను కంపెనీ తొలగించింది. 30 రోజుల కాలపరిమితితో వచ్చే ఈ రెండు ప్లాన్స్, ఇప్పటివరకు డేటాతో పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ద్వారా 20కి పైగా ఓటీటీ (OTT) యాప్స్‌కు యాక్సెస్ కల్పించేవి. అయితే ఇకపై ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండవని స్పష్టమైంది.

ఈ ప్లాన్స్ తొలగించడంతో వినియోగదారులు ఇదే తరహా ప్రయోజనాలు అందించే ఇతర ప్లాన్లను ఎంచుకోవచ్చు. రూ. 100 డేటా ప్లాన్ ఇప్పుడు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంది. దీని ద్వారా 30 రోజుల వ్యాలిడిటీతో పాటు 6 జీబీ హై-స్పీడ్ డేటా మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్-స్క్రిప్షన్ లభిస్తుంది.
మరోవైపు ఎక్కువ డేటా, ఓటీటీ కావాలనుకునే వారికి రూ. 195 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది 30 రోజుల పాటు 12 జీబీ డేటాను అందిస్తుంది. అదనంగా హాట్‌స్టార్, సోనీ లివ్ (Sony LIV) సహా 20కి పైగా ఓటీటీ యాప్స్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. కేవలం డేటా మాత్రమే చాలనుకునే వినియోగదారులు రూ. 165 ప్లాన్‌ను పరిశీలించవచ్చు. ఇందులో 30 రోజుల పాటు 12 జీబీ డేటా లభిస్తుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
