శబరిమలలో ఉద్రిక్తత: తెలుగు భక్తులపై దాడి.. గాజు సీసాతో తల పగలగొట్టిన వ్యాపారి!
మన పత్రిక, వెబ్డెస్క్: Sabarimala | శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువైందని ప్రశ్నించినందుకు ఓ షాపు యజమాని ఆగ్రహంతో హైదరాబాద్‌కు చెందిన భక్తుడిపై గాజు సీసాతో దాడి చేయడంతో తల పగిలింది.
అంతేకాక, సదరు భక్తుడి మెడలోని మాలను కూడా వ్యాపారి తెంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగు భక్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా, స్థానికులు మరియు పోలీసులు వ్యాపారికే మద్దతుగా నిలిచారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ తెలుగు భక్తుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు, ఇలాంటి వివక్షాపూరిత దాడులు జరుగుతుండటంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- HYDRAA Jobs: సరూర్నగర్ స్టేడియం వద్ద భారీగా నిరుద్యోగులు.. తోపులాట
- Telangana Rain Forecast: తెలంగాణలో మళ్లీ వానలు.. పలు జిల్లాలకు వర్ష సూచన
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ మంచి వసూళ్లు
- జాన్వీ కపూర్, శ్రీలీల కాంబినేషన్లో హిందీ రొమాంటిక్ థ్రిల్లర్
- సన్ నెక్స్ట్లోకి లోకేష్ కనగరాజ్ ‘డిసి’ డిజిటల్ హక్కులు
