Fraud Company : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 330 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన ఓ కంపెనీ తాజాగా బోర్డు తిప్పేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి ఇస్తామని ఆశ చూపించిన ఓ కంపెనీ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా రూ.330 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందని.. అందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఓ కంపెనీ నల్గొండ జిల్లాలోని ప్రజలకు భారీగా ఆశ చూపించింది. 4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి ఇస్తామని, అలాగే రెండేళ్ల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. రెండేళ్లు పూర్తయ్యాక మరో రూ.8 లక్షలు తిరిగి ఇస్తామని చెప్పారు.
దీంతో చాలామంది జనం 4 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత వాళ్లు చెప్పిన విధంగా వడ్డీ ఇవ్వలేదు. రిజిస్ట్రేషన్ అయితే చేశారు కానీ.. భూమి ఎక్కడో చూపించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళనకు దిగారు. ఆ సంస్థ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు ఎవ్వరికీ కనిపించకుండా పారిపోయినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
