WhatsApp
Advertisement

APSRTC Bus : సీటు కోసం ప్రయాణికుడి జుట్టు పట్టుకొని కొట్టిన మహిళలు

APSRTC Bus : ప్రస్తుతం ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం నడుస్తోంది. ఆధార్ కార్డు ఉంటే చాలు ఏపీ వ్యాప్తంగా ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలు ప్రయాణం చేయొచ్చు. అందుకే ఆర్టీసీ బస్సులలో మహిళల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడి జుట్టు పట్టి మహిళలు కొట్టారు. ఈ ఘటన తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. సీటులో ప్రయాణికుడు కూర్చొన్నాడని అతడిపై దాడి చేసి అతడిని మహిళలు సీటు నుంచి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement