Advertisement

Ibomma Ravi : పూర్తిగా మారిపోతా.. మళ్లీ పైరసీ జోలికి వెళ్లను

Ibomma Ravi : నేను పూర్తిగా మారిపోతాను. మళ్లీ పైరసీ జోలికి వెళ్లను.. అంటూ పోలీసుల వద్ద ఐబొమ్మ రవి ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవిని తిరిగి కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఆరేళ్ల పాటు నన్ను ఎవరూ పట్టుకోలేకపోయారు అనే ధీమాతోనే నెట్ వర్క్ పెంచుకున్నాను. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే దీన్ని మొదలు పెట్టాను. జైలు నుంచి బయటికి వచ్చాక పూర్తిగా మారిపోతాను. అస్సలు పైరసీ జోలికి మళ్లీ వెళ్లను.. అని కస్టడీలో ఐబొమ్మ రవి పోలీసులతో ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.

Advertisement