Wife Suicide : వంట సరిగ్గా చేయట్లేదని తన భార్యను పుట్టింట్లో వదిలేసి వచ్చాడు ఓ భర్త. ఆ తర్వాత భార్య ఫోన్ చేస్తే నువ్వు నాకు అక్కర్లేదు.. అక్కడే చావు అంటూ భర్త తిట్టడంతో మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే పెళ్లి అయిన శివలింగం, శిరీష దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. వికారాబాద్ జిల్లాలోని మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం.. తన భార్యను వంట సరిగ్గా చేయడం లేదని రోజూ తిట్టేవాడు.
తనకంటే తక్కువగా చదువుకుందని కూడా చులకనగా చూసేవాడు. దీంతో అతడి వేధింపులను తట్టుకోలేని శిరీష అతడిపై తిరగబడటంతో ఆమెను తీసుకెళ్లి తన పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత రోజు శిరీష ఫోన్ చేస్తే నువ్వు నాకు అక్కర్లేదు అంటూ భార్యను దూషించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక శిరీష మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు భర్తే కారణమని శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
