Advertisement

భగవద్గీత పోటీల్లో చిన్నారి మోక్షిత ప్రతిభ.. రాష్ట్ర స్థాయికి ఎంపిక!

మన పత్రిక, వెబ్​డెస్క్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థిని మోక్షిత మరాఠీ భగవద్గీత కంఠస్థంలో అద్భుత ప్రతిభ కనబరిచింది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆమె విజేతగా నిలిచి, రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

అశోక్ నగర్ శాఖకు చెందిన మోక్షిత, ప్రాథమిక స్థాయి (ఒకటవ తరగతి వరకు) విభాగంలో ఈ ఘనత సాధించింది. చిన్ననాటి నుంచే తమ బిడ్డకు హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నామని తల్లిదండ్రులు వెంకట రాములు, స్వప్న రాణి తెలిపారు.

Advertisement

పిల్లలకు చిన్నప్పటి నుంచే సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించడం వల్ల వారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వారు పేర్కొన్నారు. మోక్షిత తల్లిదండ్రుల స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Advertisement